
పయనించే సూర్యుడు అక్టోబర్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఏన్కూర్‌లో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, స్వర్ణ నరేందర్ అధ్యక్షతన ఏన్కూరు ప్రధాన సెంటర్ నందు కేక్ కట్ చేసి మంత్రి జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడంతో, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింధన్నారు. అనంతరం కేకును నాయకులు ఒకరికొకరు తినిపించుకున్నారు.ఈ కార్యక్రమంలో గార్ల ఒడ్డు సొసైటీ చైర్మన్, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్, లచ్చిరాం నాయక్, భూక్యా లాలూనాయక్, మేడ ధర్మారావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, మొగిలి నాగరాజు, మజీద్, సురేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, భూక్య హరిలాల్ నాయక్, బగ్గు నాయక్, వర శంకర ప్రసాద్, కట్టా సత్యనారాయణ, గాలిబు, స్వర్ణ ప్రహ్లాద రావు, గిద్దగిరి సత్యనారాయణ. సాయి, తదితరులు పాల్గొన్నారు.