పయనించే సూర్యుడు గాంధారి 18/06/25
మండల కేంద్రంలోని తిప్పారం తండా గ్రామ పంచాయతీలో గల అంగన్వాడీ కేంద్రంలో (ఈసీసీఈ) డే ను సూపర్వైజర్ వినోదిని ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ శారద నిర్వహించారు. ఈ డే అంగన్వాడీ కేంద్ర పరిధిలో గల సున్నా నుండి ఐదేళ్ల వయసు వరకు ప్రతి పిల్లవాడి పై వ్యక్తిగత శ్రద్ధ, ఆరోగ్య సంరక్షణ మరియు జీవన విధానంపై వారి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని పర్యవేక్షకురాలు వినోదిని తెలిపారు. పుట్టినప్పటి నుండి ఎనిమిదేళ్ల వరకు పిల్లల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. కేంద్రంలో ఆట ఆధారిత కార్యక్రమాల ద్వారా వారి శారీరక, మానసిక సామాజిక, అబిజ్ఞ మరియు సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, ప్రవీణ్, గ్రామపంచాయతీ కార్యదర్శి సింధు మరియు పిల్లలు వారి వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.