పయనించే సూర్యుడు జనవరి 26 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్యశంకరపట్నం మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనీల్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సామూహికంగా రాజ్యాంగ పీఠికను చదివి అంబేద్కర్ ఆశయాలు కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దొంగల రాములు, దాసరపు నరేందర్, కొయ్యడ అశోక్, పడాల వెంకటలక్ష్మి, రాసమల్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, పోతునూరి రాజు, బొజ్జ సాయి ప్రకాష్, ఎల్కపెల్లి సంపత్, నిమ్మశెట్టి సంపత్, గూళ్ల రాజు, చెరుకు శివ, మెడిశెట్టి రాజేష్ మండల కార్యవర్గ సభ్యులు వివిధ గ్రామాల బూతు అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు