బాపట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఘంటా అంజిబాబు
పయనం చేసే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 15:- రిపోర్టర్ (కే శివకృష్ణ)
రాజ్యాంగ స్ఫూర్తిని ఇనుముడింపజేసే విధంగా మహనీయుడు పూజ్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం ఎంతో సంతోషకరమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంటా అంజిబాబు తెలియజేశారు. సోమవారం ఆయన 34వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ఆదర్శంగా తన పాలన ని సాగించిందని ఆయన అన్నారు. నాగార్జునసాగర్ ఆయన స్ఫూర్తికి నిదర్శనం అని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ సబ్ ప్లాన్ ని అమలు చేసి అంబేద్కర్ ని ఘనపరిచామని ఆయన అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ మాత్రమే అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, ప్రముఖులు, మక్కా రోశయ్య, సాగర్, దేవరాజు, రేణుక, ఎస్విఆర్ కుమార్ పాల్గొన్నారు.