
మహాత్మా పూలే ఆశయ సాధనే మనమిచ్చే ఘనమైన నివాళి
.
జ్యోతిరావు పూలే బీసీ సంఘం -అంబేద్కర్ యువజన సంఘం మక్తల్
పయనించే సూర్యుడు నవంబర్29 మక్తల్
జ్యోతిరావు పూలే బీసీ సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక మక్తల్ లోనీ మహాత్మ పూలే చౌరస్తాలో మహాత్మ జ్యోతిబా పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో మనుషుల మధ్య అంతరాలు సృష్టించిన కుల వ్యవస్థను, ఆచారాలు సాంప్రదాయాల పేరుతో మహిళలపై అమలవుతున్న దుర్మార్గాన్ని అంతం చేయాలంటే విద్య ఒక్కటే మార్గమని చదువు కింది కులాలకు అందాలని కొట్లాడిన గొప్ప విద్యావేత్త,సామాజిక విప్లవకారుడు మహాత్మ పూలే అని కొనియాడారు.అదేవిధంగా స్త్రీ చదువుకోవడం నిషిద్ధమైన ఆరోజుల్లో తన భార్య సావిత్రిబాయి పూలే కి చదువు నేర్పించి,బాలికల విద్య కోసం 1848 లో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటుచేసి వారికి చదువు చెప్పించడమే కాకుండా తదనంతరం దాదాపు 50 పాఠశాలలను ఏర్పాటుచేసి అంటరాని వర్గాల వారికి చదువును అందించాడన్నారు.
అంతేకాకుండా మహాత్మ జ్యోతిబాపూలే ఉస్మాన్ షేక్ అనే స్నేహితుడు, అతని సోదరి ఫాతిమా షేక్ సహాయంతో బాలహత్య ప్రతిబంధ గృహాలను ఏర్పాటు చేసి,బాల్యవివాహాలు సతీసహగమనం వంటి సాంఘిక దురాచారాల కారణంగా వితంతువులైన స్త్రీలు గర్భం దాల్చితే వారిని చెట్టు తొర్రలో పెట్టి కాల్చేసే దుర్మార్గ సంస్కృతికి బలయ్యే స్త్రీలకు ఆశ్రయం కల్పించి, బాసటనందించిన గొప్ప మానవతవాది సంఘసంస్కర్తన్నారు.1680 లో చనిపోయిన మొదటి బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ సమాధిని రాయ్గడ్ కోటలో కనిపెట్టి, బ్రాహ్మణీయ ఆధిపత్య రాజ్యాధికారాన్ని ఎదిరించి బహుజన వర్గాలకు సంక్షేమ పాలన అందించిన శివాజీ మహారాజ్ వీరత్వాన్ని ఊరూరున వీరగాథల రూపంలో ప్రచారం చేసి బహుజన రాజ్యాధికారాన్ని కాంక్షించిన బహుజన మేధావి మహాత్మా జ్యోతిబాపూలేననీ కానీ శివాజీ హిందూ మతాన్ని అతిగా ప్రేమించినట్టు, మతాన్ని ద్వేషించినట్టు చిత్రీకరిస్తూ పబ్బం గడిపే వారికి మహాత్మ పూలే ఆచరణతో సరైన బుద్ధి చెప్పాలన్నారు.అంతేకాకుండా మహాత్మ జ్యోతిబాపూలే రాసిన " "గులాంగిరి" అనే పుస్తకంలో కుల వ్యవస్థలోని క్రూరమైన బానిసత్వాన్ని చీల్చి చెండాడని,ప్రతి ఒక్కరూ ఆ పుస్తకాన్ని చదవాలని,తమ పిల్లలచేత కూడా చదివించాలని కోరారు.1873లో సత్యశోదక్ సమాజాన్ని ఏర్పాటు చేసి కుల వివక్షతను వ్యతిరేకించడం, బ్రాహ్మణులు విదేశీ దండయాత్రల ఆర్యులు అని చెప్పడం, హేతుబద్ధీకరణ ఆలోచనలతో సమాజం వృద్ధి చెందాలని అనుచరులకు బోధించాడన్నారు.1882 హంటర్ కమిషన్కు మహాత్మ జ్యోతిబాపూలే గ్రామంలో విద్యా వ్యవస్థను బలపరచాలని, అందరితో సమానంగా అంటరాని వర్గాలకు విద్య దక్కాలని ప్రతిపాదించడం జరిగింది.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు తన ముగ్గురు గురువులలో మహాత్మ జ్యోతిబాపూలే కూడా ఒకరని ప్రకటించుకున్నారని గుర్తు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్,జ్యోతిరావు పూల బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు పోలప్ప, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి,Knps జిల్లా నాయకులు విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ మొగులప్ప,గోలపల్లి నారాయణ, పెద్ద అంజప్ప, జుట్ల అంజప్ప,పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు,పెరియర్ సంఘం నాయకులు అక్షయ్ కుమార్ తేజ, టీచర్ నాగేష్, పుడమి ఫౌండేషన్ నాయకులు పవన్ ప్యాట,రవికుమార్,RTI గోలపల్లి నారాయణ,జ్యోతిరావు పూలే బీసీ సంఘం,అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కురువ ఆంజనేయులు,గుంతలి ప్రవీణ్ కుమార్,T.నరేష్, మహమ్మద్ నాసిర్,నయీం,కురువ వీరేష్, ప్రవీణ్ కుమార్, మంగలి రవికుమార్, వెంకటేష్ గౌడ్, కెవి నరసింహ సురేష్, శ్రీహరి బ్యాగరి,నాగేష్ గోలపల్లి, సందీప్ ,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
