పయనించే సూర్యుడు జూలై 8 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మొదటగా పార్టీ ఆఫీసు నందు కేక్ కట్ చేసి తరువాత బస్టాండ్ ఆవరణంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గజమాలను వేశారు. అనిల్ రెడ్డి మాట్లాడుతూ మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి తీసుకుని వచ్చిన సంక్షేమ పథకాలే పక్క రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నాయి అంటే రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చిన మహోన్నత వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని, తండ్రి ఆశయ సిద్ధాంతాల కోసం నిత్యం శ్రమించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, 2029 లో జరిగే శాసనసభ ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతారని, ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారని తెలిపారు. పై కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, జెట్ వేణు యాదవ్, మీజూరు రామకృష్ణ, తుపాకుల ప్రసాద్ మరియు వైఎస్ఆర్సిపి శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.