
వైభవంగా కలశ యాత్ర ఉచ్చవ విగ్రహాల ఊరేగింపు
పయనించే సూర్యుడు గాంధారి:21/01/26
గాంధారి మండల కేంద్రంలోని నారాయణగిరి వద్ద కొలువైన మార్కండేయ ఆలయం నందు బుధవారం మార్కండేయ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గుడి నుండి ఉత్సవ విగ్రహాలు ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ పద్మశాలి సంఘ భవనానికి చేరుకున్న పిదప మహిళలు కలశాలతో ఊరేగింపు వెళుతున్న ఉత్సవ విగ్రహాల ముందు నారాయణగిరి వద్ద కొలువైన మార్కండేయ మందిరం వరకు కాలినడకన తీసుకువచ్చినటువంటి నీటితో అభిషేకం చేయడం జరిగింది. మందిరం వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన ఏర్పాటు చేశారు. డీజే చప్పులతో శివోహం నామస్మరణతో ఆధ్యాత్మిక భావన నెలకొంది. అభిషేకం అనంతరం ఉత్సవ విగ్రహాలను ఉయ్యాల సేవ నిర్వహించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, పద్మశాలి కుల బాంధవులు, సర్పంచ్, పోలీస్ శాఖ సిబ్బంది, మండల శాఖ సిబ్బంది,కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్, విడిసి కమిటీ సభ్యులు,నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.