
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి,మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం రెండు గంటలకే అభిషేక కార్యక్రమాలు అలంకరణ చేసారు. కార్యక్రమాలు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది ఆర్యవైశ్య సభ్యులు భూపాలం ఫ్యామిలీ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాడికి శ్రీశ్రీశ్రీ లక్ష్మీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో దాదాపుగా 4000 మందికి ప్రసాదం పంపిణీ 550 కేజీల ప్రసాదం చేశారు.ఉదయం 3 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలం ఫ్యామిలీ సత్యనారాయణ నాగరాజు అర్జున్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

