
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
ఆలయం లో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా మండలం లోని ఇలేగాం గ్రామం లో సోమవారం బాపూజీ మహారాజ్ జాతర ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. అది, సోమవారాల్లో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. జాతర కు మహారాష్ట్ర తో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చారు. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ బాపూజీ మహారాజ్ ఆలయం లో పూజలు నిర్వహించారు. సంస్టాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను ఘనంగా స్వాగతించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతర లో వెలిసిన దుకాణాలు రంగుల రాట్నలతో జాతర కళ కొట్టొచ్చినట్లు ఆగుపడింది. రెండు రోజుల పాటు సంస్టాన్ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఎమ్మెల్యే వెంట బిజెపి పట్టణ అధ్యక్షులు రావుల రాము, మాజీ ఎం. పి పి. రజాక్, బిజెపి మండల అధ్యక్షురాలు దేగాం సర్పంచ్ సిరం సుష్మరెడ్డి, మహాగాం సర్పంచ్ రాకేష్, స్థానిక సర్పంచ్ సిరం రాజమణి శ్రీనివాస్, నాయకులు గంగప్రసాద్, లింగన్న, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ప్రముఖ పూజరులు బాబృ మహారాజ్, ప్రకాష్ బేలె, ప్రముఖ వైద్యులు సుధాకర్, గ్రామ పెద్దలు ఉన్నారు.
