భారీగా తరలివచ్చిన అభిమానులు
పయనించే సూర్యుడు జులై 28 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :మండలం బేతంపూడి పీఏసీఎస్ డైరెక్టర్ లక్కినేని శ్యామ్ బాబు జన్మదిన వేడుకలు పెగల్లపాడు గ్రామంలో ఉన్న రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే సతీమణి కోరం లక్ష్మి , బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు హాజరై, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లక్కీనేని శ్యామ్ బాబు మాట్లాడుతూ, అనేక సంవత్సరముల నుండి మా కుటుంబాన్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నా జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగ్స్, ప్లేట్స్ పంపిణీ చేస్తున్నానని మా నాన్నగారైన స్వర్గీయ లక్కినేని వెంకటేశ్వరరావు అడుగుజాడల్లో మా కుటుంబం నడుస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ - ఉమా, లక్కినేని సుధీర్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్ ,ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్, సరిరాం, మాజీ ఎంపీటీసీ సరోజినీ, ఉండేటి బసవయ్య, కుమ్మరి చౌదరి, మురళీ, ముచ్చా సుధాకర్,సర్దార్ బన్సీ లాల్, విజయ్, కోటి, హనుమంతు, వెంకటి, రమేష్,రాజు,సర్వయ్య, రాంబాబు, సుధీప్ తదితరులు పాల్గొన్నారు.ఎండ్ న్యూస్