
పయనించే సూర్యుడు ఏప్రియల్ 28 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన శాఖాగ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన తరగతులు మంగళవారం ప్రారంభించడమైనది. ఈ కార్యక్రమంనకు స్థానిక ఉపాధ్యాయులు , మట్టపర్తి కమలేశ్వర పేరిశెట్టి, తాతపూడి సుబ్రహ్మణ్య శర్మ బి . నాగ విష్ణు . ఎం .ఎస్ .ఎం .బి . జ్యోతి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వేసవి శెలవుల్లో నిర్వహించే 40 రోజుల వేసవి విజ్ఞాన తరగతులలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవలసినదిగా లైలేరియన్ కే . తులసీ లక్ష్మి తెలియజేసారు .