పార్టీ జెండా ఆవిష్కరించిన నాయకులు
పయనించే సూర్యుడు మార్చి 12 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆత్మకూరులోని మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీస్థాయిలో బాణాసంచా కాల్చి ఆనందాన్నిపంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో రాష్ట్రాన్ని వెలుగుబాటలో నడిపించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2011 మార్చి12నవైఎస్సార్సీపీని ప్రారంభించారన్నారు.
విపత్కర పరిస్థితుల్లో పార్టీని ఏర్పాటు చేసి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని, 2019 ఎన్నికల్లో కొత్త చరిత్రనే సృష్టించారని పేర్కొన్నారు. తండ్రి తరహాలో ప్రజాభిమానం పొందిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామిని నెరవేర్చి ప్రజలకు సంక్షేమ పాలన అందించారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామిలను నెరవేర్చకుండా ప్రజలు పోరాటాలు చేస్తూ రోడ్ల మీదకు వచ్చేలా పాలన సాగిస్తుందని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని, చెప్పిన ప్రతి హామిని ప్రజలకుచేసేలాపోరాటాలు సాగిస్తామన్నారు. వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామిలన్నింటిని అమలు చేసేలా వైఎస్సార్సీపీ ప్రజలతో నిలిచి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. నిరుద్యోగభృతి, ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం యువతపోరుకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇలా ప్రజలకు ఏ అవసరమొచ్చినా వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిలు సిద్దంగా ఉన్నారని. పార్టీ నాయకులు. కార్యకర్తలందరూ ధైర్యంగా ప్రజాసమస్యలపై పోరాటాలకు సిద్దం కావాలని పేర్కొన్నారు.అంతకు ముందుగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న పలువురు నాయకులు కార్యకర్తలను. జిల్లా. నియోజకవర్గస్థాయి పార్టీ పదవులు పొందిన వారిని పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి పార్టీ కండువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బూత్ కమిటిల అధ్యక్షుడు బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి, నియోజకవర్గ మహిళా కన్వీనర్, జడ్పీటీసీ పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, జిల్లా యాక్టివిస్ట్ సెక్రటరి పులిమి రమేష్ రెడ్డి, మర్రిపాడు మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులునాయుడు, నియోజకవర్గ పలు విభాగాల అధ్యక్షులు నందా ఓబులేసు, బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, నందవరం ప్రసాద్, మాజీఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లు, భారీస్థాయిలో నియోజకవర్గ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.