రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణం వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జరుపుకుంటున్న దృశ్యం..
రుద్రూర్, జూలై 08 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం వద్ద బ్లాక్ కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ లు మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు ఉచితంగా 108, 104 అంబులెన్సు సౌకర్యం, రైతులకు రుణమాఫీ, పలు సంక్షేమ పథకాలు అందించారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ నిస్సార్, కర్క అశోక్, పత్తి రాము, ఇందూర్ కార్తిక్, తోట సంగయ్య, అక్కపల్లి నాగేందర్, డా.రఫీక్, ఫుర్ఖన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.