
పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న జగన్ వీరాభిమాని భానోత్ నరేష్
పయనించే సూర్యుడు డిసెంబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు: అభివృద్ధి, సంక్షేమం, విద్య ,వైద్య రంగాలకు అభివృద్ధి ప్రదాత వైఎస్ఆర్సిపి అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏన్కూరు యూత్ జగన్ అభిమానులు అన్నారు.ఆదివారం జగన్ ఏన్కూర్ యూత్ ఆధ్వర్యంలో ఏన్కూర్ సెంటర్లో వైఎస్ ఆర్ సి పి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు కేకును ఏన్కూరు యూత్ కలిసి కట్ చేశారు. వైయస్ఆర్సీపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అభిమాని నరసింహారావు మాట్లాడుతూ
అభివృద్ధి, సంక్షేమ, విద్య, వైద్య రంగాలకు దివంగత వైయస్సార్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తి ప్రదాతలు అన్నారు. రాజకీయాలు ఉన్నంతవరకు వైయస్సార్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. వైఎస్ఆర్సిపి శ్రేణులు సమిష్టి కృషితో జగనన్న ముఖ్యమంత్రిగా అయ్యేందుకు కృషి చేయాలి అన్నారు. పార్టీ శ్రేణులు అందరూ ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. బానోతు నరేష్ మాట్లాడుతూ పేదలకు విద్య, వైద్యం శాశ్వతంగా దూరం చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రమంతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను నాయకులు గమనించకుండా మొండి వైఖరిగా ముందుకు సాగడం బాధాకరమన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల శాశ్వతంగా పేదలకు విద్య, వైద్యం దూరం అవటమే కాకుండా ఖరీదైన వస్తువుగా అవుతుందన్నారు. పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలతో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బానోతుల నరేష్ గార్ల ఒడ్డు మాజీ ఉపసర్పంచ్ పటాన్ మజీద్ ఖాన్ నారాయణదాసు నరసింహారావు కూరాకుల రమేష్ చింతలపైన నరీన్ ఆది నరసరావు మారేపల్లి పెద్దబాబు ముల్లపాటి విజయ్ పాముల కళ్యాణ్ గోపి చారి కుషిని చిన్న జగన్నాథ్ బుక్య సురేష్ వల్లభనేని నరసరావు తదితరులు పాల్గొన్నారు
