పయనించే సూర్యుడు ఆగస్టు 15 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
శ్రీసత్యం జూనియర్ కళాశాలలో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపినారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి మాట్లాడు1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. మనమంతా అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ఒకరోజులో వచ్చింది కాదు.ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు దీర్ఘకాలం పాటు పోరాటం, త్యాగాల ఫలితంగానే ఇది సాధ్యమైంది. మహాత్మా గాంధీతో పాటు నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎందరో గొప్ప నాయకుల పోరాటాలు మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టాయి. వారి ధైర్యంతో పాటు వారి సాహసాలు, దేశభక్తిని మనం ఎప్పటికీ మర్చిపోలేదు.. ఈరోజు మనం కేవలం స్వాతంత్ర్యం దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడమే కాదు.. మన దేశం సాధించిన ప్రగతిని కూడా గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది. గత 79 సంవత్సరాలలో భారతదేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతూ వస్తోంది.. వ్యవసాయం, విద్య, వైద్య, పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో మన దేశం ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తూ వస్తోంది. అలాగే అంతరిక్షంలో చంద్రయాన్, ఆదిత్య వంటి మన విజయాలు మన శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థికంగా కూడా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ వేడుకల్లో అంకయ్య, రెహమాన్ పాల్గొన్నారు.