రుద్రూర్, ఏప్రిల్ 26(పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి తెల్ల గోపి )రుద్రూర్ : కుమ్మరి కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ గోరిబా కాకా పుణ్యతిథి వేడుకలను రుద్రూర్ మండల కేంద్రంలో కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి శాలివాహన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.