
రుద్రూర్, ఫిబ్రవరి 19 (పయనించే సూర్యుడు,రుద్రూర్ మండల ప్రతినిధి తుక్కి మహేందర్) :
రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద మరాఠ సామ్రాజ్య యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నాయకులు గుండురి ప్రశాంత్ గౌడ్, పార్వతి మురళి, కుమ్మరి గణేష్, వడ్ల నరేష్, హనుమాన్ స్వాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
