
మహిళల విద్య,రాజకీయాభివృద్ధికి పాటుపడదాం
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకిద్దాం
{పయనించే సూర్యుడు} {జనవరి 4 మక్తల్}
స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే చౌరస్తాలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 1831 సం,, జనవరి 3న మహారాష్ట్రలోని నైగాం గ్రామంలో పుట్టిన సావిత్రిబాయి 9ఏళ్ల వయస్సులో మహాత్మా జ్యోతిబా పూలేను పెళ్లాడి,బాలికల,శూద్ర-అతిశూద్రుల విద్యాబివృద్ధికి కృషి చేసి ఈ దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా దేశవ్యాప్తంగా సావిత్రిబాయి పూలేను కీర్తిస్తున్నారన్నారు.అదేవిధంగా భర్త మహాత్మ జ్యోతిబాపూలే వారసత్వాన్ని పూనికిపుచ్చుకొని మహిళలకు స్వేచ్ఛ,స్వాతంత్రం అనేదే లేకుండా వారిని పురుషుల మరియు కుటుంబాల అవసరాలు తీర్చే ఒక వస్తువుగా మార్చిన మనువాద బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించి,తన స్నేహితురాలు ఫాతిమా షేక్ వంటి వారితో కలిసి సామాజికరణోద్యమాలను నడిపిన సావిత్రీబాయి పూలే సామాజిక విప్లవకారిణిగా చరిత్రలో స్థానం సంపాదించిందన్నారు.ఈ క్రమంలోనే మహాత్మ జ్యోతిబాపూలే 1873 సెప్టెంబర్ 24 న స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ద్వారా కులాంతర్వివాహాలను ప్రోత్సహించడం,బాల్య వివాహాల ద్వారా వితంతువులైన స్త్రీలకు, కుటుంబాల నుండి వెలివేయబడ్డ గర్భిణీ స్త్రీలకు ఆశ్రమాలు ఏర్పాటు చేసి బాసటగా నిలవటమే కాకుండా నేడు మహిళలు విద్య రాజకీయ రంగాలలో రాణిస్తుండటానికి ఆనాడు సావిత్రిబాయి పూలే కొనసాగించిన పోరాటఫలితమే అన్నారు. ఇటువంటి సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించడం అంటే విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,నేడు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా, మహిళలపై అమలవుతున్న పురుషాధిక్యతకు వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడే సావిత్రిబాయి పూలేకు నిజమైన నివాళి అర్పించిన వాళ్ళమ వుతామన్నారు కాబట్టి ఆ దిశగా పౌర సమాజం పనిచేయాలని ఆకాంక్షించారన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ,ప్రజా సంఘాల నాయకులు మరియు అంబేద్కర్ పూలే వాదులు యువత తదితరులు పాల్గొన్నారు.