పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఇన్చార్జివడ్ల శ్రీనివాస్ మార్చ్ 5 తేదీ ZPHS మంథన్ గోడ్ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం, ఘనంగా జరిగింది. 30 దాకా విద్యార్థులు ఉపాధ్యాయులుగా తమ విధులను నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో, జిల్లా కలెక్టర్ గా వరలక్ష్మి,DEO గా విష్ణు,DPT.DEO నవీన్,MEO గా, విశ్వతేజ వ్యవహరించారు. పాఠశాల గజిటెడ్ హెడ్మాస్టర్ గా అనిల్, ఉండగా,మిగతా వాళ్లంతా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు… అనంతరం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో కార్యక్రమంలో భాగస్వాములైన విద్యార్థిని విద్యార్థులంతా, తమ అభిప్రాయాలను ప్రకటించారు. ఉపాధ్యాయులుగా పాల్గొన్న వారిలో మమత మొదటి బహుమతి పొందగా,శ్రావణి,అక్షయ,తరువాతి స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాధ్యాయులు,అమీరుద్దీన్.మరియు ఉపాధ్యాయ బృందం, AAPC చైర్మన్ స్వప్న పాల్గొన్నారు