
//పయనించే సూర్యుడు //మార్చ్ 27మక్తల్ //
స్థానిక ఎంపిహెచ్ఎస్ రుద్ర సముద్రం పాఠశాల యందు ఈరోజు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం మరియు అన్యువల్ డే కార్యక్రమం జరుపుకోవడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయుల పాత్ర అధికారుల పాత్ర నిర్వహించారు జిల్లా కలెక్టర్ గా పి చైత్రిక, డిప్యూటీ కలెక్టర్గా పి శివలీల, డీఈవోగా రమేష్, ఎంఈఓ గా కురుమూర్తి పాఠశాల హెడ్మాస్టర్ గా ఎం హారతి గా విధులు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి హేమలత. మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఆనవాయితీగా పాఠశాలల్లో స్వయం పరిపాలన దినోత్సవం అన్యువల్ డే జరుపుకుంటాము ఇటి కార్యక్రమం వల్ల విద్యార్థులు పాఠశాల ఏ విధంగా నిర్వహణ జరుగుతుంది ఉపాధ్యాయ విధులు ఏ విధంగా కష్టనష్టాలు ఉంటాయి మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందించడం సమస్యల పరిష్కారాల మెలికలు నేర్చుకోవడం తమ కాళ్లపై తమే ఏవిధంగా నిలబడాలనే విషయం నేర్చుకోవడం మరియు మంచిగా చదువుకోవాలని ఆకాంక్ష పెరుగుతుంది మరి విద్యార్థులు అందరు కూడా చక్కగా చదువుకోని తమ గ్రామం పేరు మండలం పేరు రాష్ట్రస్థాయిలో తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తూ అభినందన తెలియజేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ శ్రీమతి. ఎం స్వప్న స్కూల్ అసిస్టెంట్లు కుమార్ ప్రహల్లాద ఎన్ మంజులత బి దివ్య జ్యోతి ఎం ఆంజనేయులు శ్రీ రామ్ కిరణ్ టీ ప్రమీల వరుణ్ కుమార్.. గ్రామ పెద్దలు రుద్ర సముద్రం సర్పంచ్ శ్రీ లింగప్ప, గ్రామ ఉపసర్పంచ్ రామలింగప్ప పాఠశాల ఆపక చైర్మన్ శ్రీమతి శివలీల అదేవిధంగా గ్రామ పెద్దలు గ్రామ అధికారులు అనధికారులు అందరు కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగినది ప్రస్తుతము పాఠశాల ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకు నిర్వహణ జరుగుచున్నది. గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందము కోరడం జరిగినది
