పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి26//ఉట్కూరు ఊట్కూర్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల మొగ్ధుమ్ పూర్ లో ఈ స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గా జి నందిని, ఈవో గా మనుష, ఎంఈఓ గా శిరీష, కలెక్టర్ గా సింధుజ వ్యవహరించారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులగా వ్యవహరించిన విద్యార్థులు పాఠాలు ఎంతో చక్కగా బోధించడం జరిగింది .పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం నిర్వహించడం వలన విద్యార్థులకు ఉపాధ్యాయుల నిరంతర శ్రమ తెలియడంతో పాటు తాము కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళాలని లక్ష్యం పెట్టుకోవడానికి ఎంతగానో దోహదం చేస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజ్ చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మహేష్,నర్మద , శ్రీదేవి విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు..