తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేస్తున్న తహసీల్దార్ తారాబాయి..
రుద్రూర్, ఆగస్టు 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ తారబాయి, ఎంపీడిఓ కార్యాలయం వద్ద ఎంపీడిఓ భీమ్ రావు, పోలీస్ స్టేషన్ లో ఎస్సై సాయన్న, గ్రామ పంచాయతీ కార్యాలయం సెక్రెటరీ ప్రేమ్ దాస్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గ్రంథాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జాతీయ జెండాలు ఎగురవేస్తూ 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన పితామహులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.