
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
భైంసా పట్టణం లో ఘనతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొని భైంసా ఏరియా ఆసుపత్రి లో జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన తంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ లో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా వేడుకల్లో పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రి లో సెక్యూరిటీ గార్డ్ లకు సర్టిఫికెట్ లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ప్రజల కు ఘన తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ 11 సంవత్సరాల పాలనలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.
