
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ పెద్దమ్మతల్లికి దసరా శరన్నవరాత్రులలో భాగంగా పదవరోజు శ్రీ చండికాదేవి అలంకరణ మరియు చండీ హోమము వేద పండితుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఘనంగా నిర్వహించారు దాదాపుగా 11 మంది దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రతిరోజు లాగానే చోడశోపచారాలు చేసి న అనంతరం వనమూలికలు హోమంలో వేసి ద్రవ్యాలు పట్టు వస్త్రాలు చండీ హోమంలో అమ్మవారికి సమర్పించారు పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

