
చండూరు మున్సిపాలిటీలో 6వ,3వ,వార్డు ప్రజల దాహర్తి తీర్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 28.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మున్సిపాలిటీలో నెలకొన్న దీర్ఘకాలిక నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. స్థానికుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి సరఫరా మెరుగుపరచడంపై దృష్టి సారించారు. వేసవిలో తాగునీటి ఎద్దడితో నీరు లేక అల్లాడుతున్న 6వ, 3వ వార్డ్ ప్రజలు సమస్య ఉందని చెప్పగానే బోర్లు వేయించి మంచి నీటి సమస్యను తీర్చిన మహానుభావుడు మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకి ధన్యవాధాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ,మున్సిపల్ కమిషనర్ ఎం మల్లేశం, ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షుడు శిరంశెట్టి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ జిల్లా నాయకులు గజ్జల కృష్ణారెడ్డి, ఇరిగి వెంకటేశం, పందుల సత్యం, సరికొండ వెంకన్న,మరియు కాలనీవాసులు మరియు తదితరులు పాల్గొన్నారు.
