
నాలుగ వ రోజు శిక్షణ తరగతుల కు హాజరైన వార్డు నంబర్లకు
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 27.
చండూరు ఎంపిడిఓ కార్యలయంలో గురువారం నాడు నాలుగోవ రోజు వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ అధికారులు వార్డు సభ్యులకు స్థానిక సంస్థల పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు విధానాలపై అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ యాదగిరి , సూపరిండెంట్ నర్సింహా టి ఓ టి రాజేందర్ ,సెక్రెటరీ లు సంధ్య , గీతాంజలి వార్డు సభ్యులు, ఎంపిడిఓ కార్యలయ ఈ పంచాయతి ఆపరేటర్లు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
