
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఏ.ఎస్.పి. రోహిత్ కుమార్ చౌదరి.యాడికి సి.ఐ. తో కలసి యాడికి మండలం చందన గ్రామాన్ని సందర్శించి రైతుల పొలాలలో రాత్రివేళ గుర్తు తెలియని దొంగలు కరెంటు వైర్లను, మోటార్ డ్రిప్ వైర్లను కత్తిరించుకుని పోతున్నందున దొంగతనం జరిగిన ఏరియాలను సందర్శించడం జరిగింది. గత నెలలో ఆదాయం సిమెంట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయిస్ నివాస గృహంలో వెండి దొంగతనం జరిగిన కేసులో దర్యాప్తులో భాగంగా సందర్శించడం జరిగింది. నేరాల నియంత్రణ గురించి మరియు గస్తీ గురించి పలు సూచనలు చేయడం జరిగింది.
