పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 24
అల్లూరి సీతారామరాజు.జిల్లా, చింతూరు. మండలం, చట్టి గ్రామపంచాయతీ.చట్టి గ్రామంలో గ్రామ సర్పంచ్ రవ్వ. భద్రమ్మ అధ్యక్షతన జరిగిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఏడుగురాళ్లపల్లి PHC డాక్టర్.Sk.రీహానా మాట్లాడుతూ ప్రధానంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు పౌష్టిక ఆహారము రక్తహీనతల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే టిబి వ్యాధికి గురించి సంబంధిత సూపర్వైజర్ రవ్వ. రామాంజనేయులు మాట్లాడుతూ టీబి యొక్క లక్షణాల గురించి దానిని గుర్తించటం దానికి సంబంధించిన చికిత్సల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన సిబ్బంది మరియు అంగన్వాడి ఆశ వర్కర్లు అలాగే గ్రామ "పెసా" కమిటీ కార్యదర్శి పోడియం. రామకృష్ణ,గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది.