పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 23
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలోని చట్టి గ్రామపంచాయతీ లో గురు వారం ఉదయం 10 గంటలకు చట్టి గ్రామ పంచాయతీ వద్ద వారపు పశువుల సంతకు బహిరంగ వేలం పాట నిర్వహించడం జరిగినది, ఈ వేలంపాట లో చట్టి మరియు వీరాపురం గ్రామస్థులు పాల్గొన్నారు. వీరి లో వీరాపురం గ్రామానికి చెందిన శ్రీ పీసం సత్తిబాబు హెచ్చు పాటదారునిగా నిలిచి పశువుల సంత పాట హక్కును కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి రవ్వ భద్రమ్మ, ఉప సర్పంచ్ రాములు,డిప్యూటీ ఎంపీడీఓ R. వీర్రాజు, పంచాయతీ కార్యదర్శి మహ్మద్ ఆలీ, పెసా కమిటీ ఉపాధ్యక్షులు తుర్రం చినముత్తయ్య మరియు కార్యదర్శి పొడియం రామకృష్ణ గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం గ్రామ సర్పంచ్ శ్రీమతి రవ్వ భద్రమ్మ అధ్యక్షతన గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) గ్రామ సభ జరిగినది ఈ గ్రామ సభలో డిప్యూటీ ఎంపీడీవో ఈ గ్రామ సభ యొక్క ప్రాధాన్యతను వివరించి గ్రామ అభివృద్ధికి సంబంధించిన అనేక విభాగాల అంశాలను క్రోఢీకరించి ప్రణాళికను రూపొందించుకోవాలని తెలియజేశారు, గ్రామస్తులు వారి సమస్యలను తెలియజేసి త్వరితగతిన పరిష్కరించగలరని విన్నవించుకున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా చట్టి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికను రూపొందించి వీలైనంత త్వరగా గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పంచాయతీ కార్యదర్శి తెలియజేశారు. ఈ గ్రామసభలో ప్రజాప్రతినిధులు ,సచివాలయ సిబ్బంది,అంగన్వాడి, ఆశ, డ్వాక్రా యానిమేటర్లు,MGNREGS ఫీల్డ్ అసిస్టెంట్,మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.