పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 16
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చట్టి పంచాయతీ చట్టి, వీరపురం గ్రామాలను ఈరోజు కాంటూర్ 41.15 లో చేర్చాలని చట్టి నుండి రెండు గ్రామాల ప్రజలు బైక్ ర్యాలీ చింతూరు ఐ. టి. డి.ఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే మా రెండు గ్రామాలు ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలల్లో వచ్చే వర్షాలు కారణంగా గ్రామస్తులు ఎదుర్కొనే బాధలు ఆ దేవుడు ఎరుగు వ్యవసాయం, వ్యాపారాలు, చేతి పనులు లేక అభివృద్ధిని కోల్పోయి ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నాము. వర్షాకాలం వచ్చిందంటే పోలవరం ముంపు ప్రాంతాలైన విలీన మండలంలో ఉన్న ప్రజలు బాధలు ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని అలాగే మా రెండు గ్రామాలను కాంటూరు 45.75 నుండి ముందస్తు చర్యలు తీసుకొని కాంటూరు 41.15లో కలిపి నష్ట పరిహారము పునరావాసం కనిపించి తగు చర్యలు తీసుకుంటారని వీరాపురం, చట్టి గ్రామస్తులు ఏపీఓ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.