( సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం
సూరంపల్లి గ్రామంలో చతుర్విధ టాలెంట్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు జె శంకర్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. పిల్లలందరూ సంతోషంతో రకరకాల పువ్వులు సమకూర్చి టీచర్స్ యొక్క సహకారాలతో బతుకమ్మ లు పేర్చడం జరిగింది. ఈ యొక్క సాంప్రదాయం మన దేశంలో మన తెలంగాణ తప్ప ఎక్కడ లేదు వివిధ రకాల పువ్వులు చెట్లు ఈ సాంప్రదాయం ద్వారా పూజించుట జరుగుతుంది. అంతేకాకుండా రకరకాల చెట్ల గాలి ద్వారా వర్షాకాల జబ్బులు రోగాలు తగ్గే అవకాశం ఉంది. ఈ సాంప్రదాయం ఒక్క తెలంగాణలోనే కలదు ఈ విషయాలన్నీ పిల్లలకు తెలియజేస్తూ మన పాఠశాల యందు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్
జె శంకర్ టీచర్స్ లింగం. ప్రభాకర్. కిరణ్. కృష్ణవేణి. అనిత. భార్గవి. రోజా. తదితరులు పాల్గొనడం జరిగింది