పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2 కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) మాఘ శుద్ధ పంచమి రోజున జన్మించిన సరస్వతి దేవిని విద్యార్థులు భక్తితో పూజిస్తే సర్వ శుభాలుచేకూరుతాయని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ పంచమిని పురస్కరించుకుని సరస్వతి పూజ నిర్వహించి అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాది దేవత అయిన సరస్వతి దేవి జ్ఞానాన్ని ప్రసాదించే చల్లని తల్లి అని అన్నారు. విద్యను, ప్రతిష్టను, కవితా శక్తిని ఆమె అనుగ్రహిస్తుందని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.