
పయనించే సూర్యుడు డిసెంబర్13 అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం
సుండుపల్లి మండల కేంద్రంలోని సంత గేటు ప్రాంతంలో కంప చెట్లు అధికంగా పెరిగిపోవడంతో పందుల బెడద పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మండల ప్రజలు రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు, మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన చప్పిడి సోదరులు, తమ సొంత నిధులతో జెసిపి ఏర్పాటు చేసి కంప చెట్లను తొలగింపజేశారు. దీంతో సంత గేటు ప్రాంతం పూర్తిగా పరిశుభ్రంగా మారి ప్రజలకు ఉపశమనం కలిగింది. స్థానికులు చప్పిడి సోదరుల సేవాభావాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
