పయనించే సూర్యుడు ఫిబ్రవరి 24 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం సీ.సీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు . ప్రజా సంక్షేమం,అభివృద్ధి, సమపాలనలో తీసుకెళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. సోమవారం నాడు సుండుపల్లె మండలం,మాచిరెడ్డి గారి పల్లె గ్రామపంచాయతీ,తరుగు పల్లె గ్రామంలో సి.సి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను అయన ప్రారంభించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి సూచికలుగా సిమెంట్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అదేవిధంగా గత వైసిపి ప్రభుత్వ పాలన ఎక్కడ ఏ గ్రామానికి కనీస అవసరాలైన రోడ్లు లేకపోవడం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కళ్లే రెడ్డప్ప,మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రాజు,మాజీ ఎంపీటీసీ మోహన్ బాబు నాయుడు,సీనియర్ నాయకులు శివరామనాయుడు, బెల్లాల రమణయ్య,చంద్రమౌళి, ఎల్వి రమణ,సుబ్బారావు,సురేష్ నాయుడు,అంజి, మారుతి, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.