
పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 10, శర్మాస్ వలి,మండల రిపోర్టర్ యాడికి :
ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరగనున్న సిపిఐ పార్టీ శత వార్షికోత్సవ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. శనివారం యాడికి మండల కేంద్రంలో సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో జీపు జాతా నిర్వహించారు.ఈ సంద ర్భంగా జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ప్రజల మధ్య నిత్యం ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని తెలిపారు.ఈ సందర్భంగా ఖమ్మంలో ఘనమైన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు రైతులు, కూలీలు, కార్మికులు వ్యవసాయ కూలీలు పార్టీ అభిమానులు అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షు లు,కార్యదర్శులు ప్రేమ్ కుమార్, కుల్లయప్ప,జిల్లా అధ్యక్షులు నాగరాజు నాయక్, కళాకారులు గిరి, వెంకటరాముడు,సిపిఐ సీనియర్ నాయకులు శ్రీరాములు, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఓపిరెడ్డి, సూర్యనారాయణ సిపిఐ పట్టణ కార్యదర్శి కుల్లాయి రెడ్డి, సిపిఐ నాయకులు ఆంజనేయులు, తాండ్ర సుభా, ఆది నారాయణ రెడ్డి, మల్లారెడ్డి, ప్రబోధ, మాబూ, శ్రీరాములు, కంభగిరి , రామానుజుల రెడ్డి, చైతన్య, చీమల వాగుపల్లి శ్రీరాములు,తదితరులు పాల్గొన్నారు.
