
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 04 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం: జిల్లా, రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనం కేసును రఘునాధపాలెం పోలీసులు చాకచక్యంగా ఛేదించి, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, దొంగిలించిన (80) కిలోల కాపర్ వైర్, 66 కేజీల బరువు ఉన్న అల్యూమినియం వైరు చుట్టలను, దొంగతనానికి ఉపయోగించిన,నిందితుల వద్ద నుండి మొబైల్ ఫోన్స్-2 మరియు రవాణా కి ఉపయోగించిన బజాజ్ ఆటో నెంబర్ : టీఎస్04 యు ఏ 1808 స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలు పోలీసుల విచారణలో ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారణ అయిన నిందితులు:ఏ–1: పిట్టల గోపి తండ్రి సీతారామయ్య, వయసు 28 సం, ముదిరాజ్, ఆటో డ్రైవర్ ఆర్వో కైకొండాయిగూడెం గ్రామం, ఖమ్మం అర్బన్ మండలం, ఖమ్మం జిల్లా
ఏ–2: అంగోత్ ఉమా శంకర్ తండ్రి లేటు వీరన్న, వయసు: 24 సం,,రాలు, కులం: లంబాడ, వృత్తి: ఆటో డ్రైవర్ ఆర్వో కైకొండాయిగూడెం గ్రామం, ఖమ్మం అర్బన్ మండలం, ఖమ్మం జిల్లా ఏ–3: శీలం నాగేశ్వరరావు తండ్రి బాబు, వయసు: 35 సం,,రాలు, కులం: ముదిరాజ్, వృత్తి: పెయింటింగ్ మరియు వెల్లింగ్ పని ఆర్వో కొండాయిగూడెం గ్రామం, ఖమ్మం అర్బన్ మండలం, ఖమ్మం జిల్లా ఏ–4: మందా చత్రపతి ప్రేమ కుమార్ ప్రేమ బుడ్డి తండ్రి రాజు, వయసు: 23 సం,,రాలు, కులం: మాల, వృత్తి: ఆటో డ్రైవర్ ఆర్వో కొండాయిగూడెం గ్రామం, ఖమ్మం అర్బన్ మండలం, ఖమ్మం జిల్లా ఏ–5: ఆకుల నాని నిరంజన్ తండ్రి దుర్గ ప్రసాద్, వయసు: 16 సం,,రాలు, కులం: ఎరుకల, వృత్తి: కూలీ ఆర్వో వైఎస్ఆర్ కాలనీ గ్రామం, ఖమ్మం అర్బన్ మండలం, ఖమ్మం జిల్లా ఏ–6: బజ్జా కృష్ణ తండ్రి శ్రీను, వయసు: 26 సం,,రాలు. కులం: మొండిబండ, వృత్తి: పాత ఇనుము కొట్టు ఆర్వో సగారాల కాలనీ(వికలాంగుల కాలనీ), రమణ గుట్ట, ఖమ్మం
నేరస్తులు పట్టుపడిన విధానం:
ఆరుగురు నేరస్తులు ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధి లో దొంగలించిన 66 కేజీల బరువు ఉన్న అల్యూమినియం వైరు చుట్టలను డబ్బులు అవసరమై ఈ రోజు అనగా 03.02.2026 న ఉదయం సమయంలో ఆపిల్ సెంటర్ లో శ్రీ ఎస్ వి.రమణ మూర్తి ఏసిపి ఖమ్మం టౌన్, ఉత్తర్వులు ప్రకారం, రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఎండి ఉస్మాన్ షరీఫ్ ఆదేశాల తో జి నరేష్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది అయిన ఎన్ఎస్ రాజు, సంజీవ్ బి.శ్రీనివాసులు, ఎండి అహమ్మద్ అలీ, వి నవీన్ తదితరులు వాహన తనికి చేయుచుండగా ఆటో నెంబర్ : టీఎస్ 04 యు ఏ 1808 గల ఆటో లో అల్యూమినియం వైరు ను పెట్టు కొని ఖమ్మం టౌన్ లో అమ్ముకుందాం అని వెళ్తుండగా ఆపిల్ సెంటర్ వద్ద ఉదయం 10:30 గంటలుకు రఘునాధపాలెం పోలీసు వారి కి అట్టి వాహన తనికిలో పట్టుపడినారు.
నేరస్తుల నేర చరిత్ర:
నేరస్తులు నలుగురు ఆటో డ్రైవర్లు,ఒకతను వెల్డింగ్ పని,ఒక బాలుడు జులాయి గాతిరిగే వాడు,గా వుంటూ పరిచయం ఏర్పడి స్నేహితులుగా మరి ఆటో డ్రైవర్లు గా పనిచేస్తే డబ్బులు సరిపోకపోవటం వలన ఎలెక్ట్రికల్ ట్రాన్స్ఫోర్మెర్స్ దొంగతనములు చేసి అందులో ఉన్న కాపర్ వైర్ అమ్ముకొని ఎక్కువ డబ్బులు సంపాదించి జల్సాలు చేయవచ్చు అని నిర్ణయించుకొని, ఎలెక్ట్రికల్ ట్రాన్స్ఫోర్మెర్స్ పడేసి అందులో ఉన్న కాపర్ వైర్ తీసే విధానం నేర్చుకొని, ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధి లో రఘునాధపాలెం మండలం,కామేపల్లి మండలం,ముదిగొండ మండలం,ఖమ్మం రూరల్ మండలం,కూసుమంచి మండలం,కొణిజర్ల మండలం,తల్లాడ మండలం,బోనకల్లు మండలం,తిరుమలాయపాలెం మండలం,ఖానాపురం హవేలీ మండలం,మొదలైన ప్రాంతాల్లో కాపర్ వైర్ దొంగతనలుకు పాల్పడి ఖమ్మం ఖానాపురం లో వున్న బజ్జా కృష్ణ అను పాత ఇనుము కొట్టు వ్యాపారి కి అట్టి కాపర్ కాపర్ వైర్ ను అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. పాత ఇనుము కొట్టు వ్యాపారి పై కూడా కేసులు నమోదు చేసి జైలు కు పంపనైనది.ఇట్టి ముద్దాయి లు అందరిపైనా వ్యవస్తి కృత నేరాల నియత్రి కరణ చట్టం ప్రకారం(Sec.112 బి ఎన్ఎస్) కేసులు పెట్టనైనది.
నేరస్తుల పై కేసుల వివరాములు: 1). రఘునాధపాలెం పోలీసు స్టేషన్-3 ( 5 ట్రాన్స్ఫార్మర్లు ) వీటితో పాటు ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధి లో మొత్తం (18) కేసులు కలవు.పిర్యాదు :రఘునాధపాలెం పోలీసు స్టేషన్ లో జిల్లా.శంకర్ , రఘునాధపాలెం పిర్యాదు మేరకు నమోదు అయిన కేసు. క్రైమ్ నెంబర్: 293/2025 యూఎస్ 305( ఈ),112,317 (2) బిఎన్ఎస్ మరియు సెక్షన్ 136,137 ఎలక్ట్రిసిటీ యాక్ట్ -2003 .స్వాధీనం చేసుకున్న ఆస్తి రికవరీ ప్రాపర్టీ 1). సుమారు 80 కిలోల ట్రాన్స్ఫోర్మెర్స్ కాపర్ వైర్ 2). 66 కేజీల బరువు ఉన్న అల్యూమినియం వైరు చుట్టలు.3). నిందితుల మొబైల్ ఫోన్స్-024).దొంగిలించిన కాపర్ వైర్ తరలించడానికి ఉపయోగించిన ఆటో నెంబర్ : టీఎస్ 04 యూఏ 1808. సమాచారం తెలియజేయడం జరిగింది