పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ 24
ఘనమైన చరిత్ర కలిగిన చింతపల్లి ప్రాంతానికి నియోజకవర్గం ఇవ్వాల్సిందేనని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు డిమాండ్ చేసారు.ఈ ప్రాంతం క్రీస్తుశకం 600 నుండి 1572 వరకు తూర్పు చాళుక్యులు,శాతావాహనులు,కళింగ,కాకతీయ,కొండవీటి రాజులు,గొల్కొండ నవాబులు,1773లో ఫ్రెంచ్ వారు,1800 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలన జరిగింది.మద్రాస్ ప్రెసిడెన్షియల్ లో భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం నుండి సాలూరు వరకు ఒకే నియోజకవర్గంగా ఉండేదని,1937లో బ్రిటీష్ హాయంలో మద్రాసు ప్రెసిడెన్షియల్ కు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం కొయ్యూరు మండలం శరభన్నపాలెంకు చెందిన పనసల పెద్దుపడాల్ కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.1946లో ప్రస్తుత జికె వీధి మండలం పెదవలసకు చెందిన కంకిపాటి వీరన్నపడాల్ ఎన్నికయ్యారు. అల్లూరి సీతారామరాజు మన్యంలో గూడెంని, మైదానంలో గొలుగొండని పోరాట కేంద్రాలుగా చేసుకుని పోరాడారని,స్వాతంత్ర్యం అనంతరం 1952లో గొలుగొండని నియోజకవర్గంగా,1955లో గూడెం నియోజకవర్గంగా ఏర్పాటు చేసారు.1962 లో గూడెం నియోజకవర్గం చింతపల్లి నియోజకవర్గమైంది. 1967లో గొలుగొండ నియోజకవర్గం కూడా చింతపల్లి నియోజకవర్గంలో కలిపారు.చింతపల్లి నియోజకవర్గంలో ఉన్న పాడేరు 1967లో పాడేరు నియోజకవర్గంగా ఏర్పడింది. చింతపల్లి నియోజకవర్గం,పాడేరు నియోజకవర్గంలలో గల కొన్ని మండలాలతో 2009లో పాడేరు నియోజకవర్గం ఏర్పాటయ్యింది.ప్రస్తుత పాడేరు,అరకు నియోజకవర్గాలు 1955 లో గూడెం నియోజకవర్గంలో ఉండేవి.పాడేరు జిల్లా కేంద్రంగా,అరకు జాతీయస్థాయిలో పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందగా గూడెం మాత్రం మండలంగా ఉండిపోవడం, చింతపల్లి నియోజకవర్గంలో ఉండిన పాడేరులో చింతపల్లి నియోజకవర్గాన్ని కలిపేసి ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని,1976లో కేంద్ర ప్రభుత్వం ఐటీడీఏలు ఏర్పాటు చేసేటప్పుడు చింతపల్లి ప్రాంతంలో గల సీలేరులో గానీ రింతాడలో గానీ ఐటీడీఏ ఏర్పాటు చేయాలనుకొన్నారు, కానీ ఐటీడీఏను పాడేరులో పెట్టడం జరిగిందని,గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు నడిబొడ్డున ఉన్న చింతపల్లి ప్రాంతంలో జిల్లా కేంద్రం ఉండాలని,ఈ ప్రాంతంలోనే అల్లూరి సీతారామరాజు మన్యం పితూరు జరిగిందని, ఆ పోరాట చరిత్రకు చిహ్నంగా చింతపల్లిలో జిల్లా కేంద్రం ఉండాలని,ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కూడా పుష్కలంగా ఉన్నాయని,విశాఖపట్నం విమానాశ్రయం,తుని రైల్వే స్టేషన్ లు ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయని జిల్లా కేంద్రం ఏర్పాటుకు అనువైనా ప్రదేశమని ప్రభుత్వానికి తెలిపామని, చింతపల్లికి జిల్లా కేంద్రం కాదు కదా డివిజన్ కేంద్రం కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరమని,ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వాలకు తగదని ఆయన హితవు పలికారు..