పోలవరం ప్రాజెక్టు 41.5ఉన్న రామవరం గ్రామపంచాయతీ ఏడు గ్రామాల కు తక్షణమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి పునరావాస కేంద్రం తరలించాలని భారీ ర్యాలీ
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 15 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం
చింతూరు ఐటీడీఏ వద్ద పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు రామవరం పంచాయతీ, ఆడవి వెంకన్నగూడెం, లక్ష్మీనగరం, సబర్ రాయి గూడెం, సోములగూడెం,రామవరంపాడు కొపల్లి,చొప్పాలిఏడు గ్రామాల నుంచి నిర్వాసితులు వేలాదిగా తరలివచ్చి చింతూరు సెంటర్ నుండి ఎర్రంపేట ఐటిడిఏ కార్యాలయం వరకు అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వసితులు భారీ ర్యాలీ నిర్వహించి ఐటిడిఏ కార్యాలయాన్ని ముట్టడించి మెరుపు ధర్నా చేసి ఐటీడీ ఏ గేట్లను సైతం తోసుకుంటూ లోపలికి రావడం జరిగింది.అనంతరం అఖిల పక్షం నాయకులు పోలవరం ప్రాజెక్టు నిర్వసితులు 41.5 మా రామవరం గ్రామపంచాయతీ లోని ఏడు గ్రామాల ఉన్నాయి అట్టి గ్రామాల నిర్వసితులకు కు అధికారులు కూడా అవార్డు ఎంక్వయిరీ చేసి ఉన్నారు.అవార్డు అయినటువంటి గ్రామాల కు వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి పునరావాస కేంద్రాలకు తరలించాలని పేర్కొన్నారు. అదేవిధంగా భూమికి భూమి అలాగే రామవరం గ్రామంలో 270 కుటుంబాలకు గాను 166 కుటుంబాలకు మాత్రమే స్ట్రక్చర్ వేల్యూ రావడం జరిగింది.మిగతా 104 కుటుంబాలకు రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు రానటువంటి 104 కుటుంబాలకు కూడా స్ట్రక్చర్ వెలివేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు అదేవిధంగా 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. అదేవిధంగా భూమిలేని గిరిజన ఒక ఎకరం భూమి ఇవ్వాలని అలాగే నిర్వాసిత గ్రామాల్లో కాటప్ తేదీలు లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి యువకులకు ప్యాకేజీ వర్తింపచేయాలన్నారు.ప్యాకేజీని ఇప్పుడున్న రేట్లు అనుగుణం గా పది లక్షలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ ఐఏఎస్ గారికి అఖిలపక్షం ఆధ్వర్యంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు కే లక్ష్మి ఎంపీపీ, బోధ బోయిన సురేష్, పులి బొజ్జి, మాడి ముత్యాలరావు