పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ మే 15 గురువారం,ఐటీడిఏ చింతూరు.
ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసి, చింతూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, ఆదివాసి జేఏసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుంజా అనిల్ మరియు చింతూరు డివిజన్ ఛైర్మెన్ జల్లి నరేష్ నేత్రుత్వంలో … 1).తక్షణమే TAC(ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్)ని ఏర్పాటుచేయాలి.2).ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి.
3).మెగా డీఎస్సీ లో ఉన్న ఏజెన్సీ పోస్టులను మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీ ద్వారా స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలి.4).ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాలన్నీ స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలి. వంటి డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఐటిడిఎ ల వద్ద నిరావధిక రిలే నిరాహార దీక్షలకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, చింతూరు డివిజన్ కమిటీ చింతూరు ఐటిడిఏ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఏపిఏజెఏసి సెంట్రల్ కమిటీ నాయకులు మడివి నెహ్రూ, ఏ యు ఎస్ పి, రాష్ట్ర నాయకులు పూసం శ్రీను, ఏపీ ఎంహెచ్ ఇఏ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావ్, ఏపిఏయుజెఏసి జిల్లా నాయకులు సోడి నారాయణ, ఏ ఐ ఏ ఇ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కాక రాజు ప్రారంభించగా… కుంజా అనిల్, జల్లి నరేష్, వేటగాని మల్లయ్య, ఉయిక రాంప్రసాద్, బేతి ముత్తయ్య, సరియం రామారావు, పూరి రవి, సున్నం రాజశేఖర్, దారవత్ లావణ్య, బానోత్ రవి, బానోత్ శివ తదితరులు పాల్గొన్నారు.