పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 4
ఏజెన్సీలోని వలస నాన్ ట్రైబల్స్ ఏజెన్సీ చట్టాలు విరుద్ధంగా ఇటుకల తయారీ మరియు వ్యాపారం కొనసాగిస్తుంటే చర్యలు తీసుకోవలసినటువంటి అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను అధికారులను ప్రశ్నించారు. 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ ఏ రకమైన స్థిర,చర వ్యాపారాలు చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా ఏజెన్సీలో వ్యాపారాలకు పాల్పడితే అధికారులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కానీ చింతూరు డివిజన్లో సిమెంట్ ఇటుకలు, బూడిద ఇటుకలు, మట్టి ఇటుక బట్టీల వ్యాపారం ఎద్దేచ్చగా కొనసాగుతున్న, వ్యాపార నిర్వహులైన నాన్ ట్రైబల్స్ పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారంటే ఈ వ్యాపారం వెనుక అధికారులు వాటా ఎంతో తేల్చాలని డిమాండ్ చేశారు. ఇటుకల తయారీకి కరెంటు వాడుతున్నారని, అసలు విద్యుత్ శాఖ వాళ్ళు కరెంట్ సప్లై ఎలా ఇస్తున్నారని ఆ శాఖపై మండిపడ్డారు. ఏ వ్యాపారం కొనసాగాలన్న దానికి విద్యుత్ అవసరమని, విద్యుత్ శాఖ ముడుపులకు అమ్ముడుపోయి నాన్ ట్రైబల్స్ కి కరెంటు మీటర్లు ఇచ్చి కరెంట్ సప్లై చేయటంతో నా ట్రైబల్స్ అక్రమ వ్యాపారుల దంధా మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తుందని. ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ ఏ రకమైన వ్యాపారాలు కూడా చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, అధికారులు ముడుపులకు అలవాటు పడి నా ట్రైబల్స్ వ్యాపారాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారని దీని మూలానే ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా నాన్ ట్రైబల్స్ కబంధహస్తాల్లో నలిగిపోతుందని ఆవేదన వ్యక్తపరిచారు. ఒకపక్క న్యాయస్థానాలు ఏజెన్సీలోని అక్రమాలు అన్నీ కూడా తొలగించాలని ఉత్తర్వులు ఇస్తుంటే, అధికారులు మాత్రం న్యాయస్థానాల ఉత్తర్వులకు విరుద్ధంగా నాన్ ట్రైబల్స్ అక్రమాలను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఏజెన్సీలో నడుస్తున్న ఇటుక వ్యాపారల తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.