
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 27
చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల సింగన్నగూడెం గ్రామమ దగ్గరలో గల రోడ్డు పక్కన ఒక గుర్తు తెలియని, సుమారు 50 సంవత్సరాలు వయసు గల వ్యక్తి అనారోగ్యంతో, లేవనేని స్థితిలో ఉం డగా, గ్రామస్తులు చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయగా, చికిత్స పొందుతూ ది. 24. 10. 2025 తారీకు సాయంత్రం 5:45 నిమిషములకు మరణించడం జరిగింది. ఈ విషయమును చింతూరు గ్రామ విఆర్ఓ మానే లక్ష్మయ్య గారు రిపోర్టు ద్వారా తెలియజేయగా, అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి చింతూరు పోలీసు వారు దర్యాప్తు చేయుచున్నారు. దర్యాప్తులో భాగంగా మృతుడు సుమారు సంవత్సర కాలముగా చింతూరు పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నట్లు తెలిసినది.సదరు వ్యక్తి ఆచూకీ తెలిసినవారు చింతూరు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము