పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 23
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం జాతీయ అంతరిక్ష దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ జి.వెంకట్రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ముల్లి శేఖర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రయాన్-3 ఆగస్టు 23 న 2023 విజయవంతం అయ్యినందున ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపబడుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధనకు ఎంతగానో కృషి చేసిన వ్యక్తియని, చంద్రయాన్ -3 చంద్రుని దక్షిణ ధ్రువం పై విజయవంతం మొట్టమొదటిగా భారతదేశం కాలు మోపిందిగా కొనియాడారు. మన భారతదేశం తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ వ్యక్తి శుభాoశుక్ల జూన్ 26న వెళ్లి మరల తిరిగి జులై 15న తిరిగి వచ్చారని, ఈ సంవత్సరం థిమ్ : ఆర్యభట్ట నుండి గగన్ యాన్ : ప్రాచీన జ్ఞానం నుండి అనంతమైన అవకాశాల వరకు అని పేర్కొన్నారు. రాజనీతి శాస్త్ర విభాగాదిపతి ఎస్. అప్పనమ్మ మాట్లాడుతూ 1969 లో విక్రమ్ సారాభాయ్ ద్వారా ఇస్రోని స్థాపించారని , ఆయన ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చి ఇస్రోని ఏర్పాటు చేశారని, ఇస్రో ద్వారా 2040 సంవత్సరం నాటికి అంతరిక్షంలో మానవ సహిత రాకెట్స్ ను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.