పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 22 :
చింతూరు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయనిక శాస్త్ర విభాగాధిపతి కించే శకుంతల, ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం,స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.కె.రత్న మాణిక్యం మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ సముద్ర నిల్ పాల్ మార్గనిద్దేశకత్వంలో "సింథసిస్ ఆఫ్ నికెల్(II) అండ్ కాపర్ (II) కాంప్లెక్స్ విత్ N,O అండ్ O,N,O - డోనార్ లైగాండ్స్ అండ్ అండ్ థైర్ కేటాలైటిక్ అప్లికేషన్స్" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు. ఈ పరిశోధన మూలంగా చవకైనా ఉత్ప్రేరకాలు ఉపయోగించి పర్యావరణ అనుకూలమైన సింథటిక్ మార్గాల ద్వారా బైఎరైల్స్ మరియు క్వినాజోలినోన్స్ వంటి ఔషధాలకు సంబంధించిన ముఖ్యమైన సమ్మేళనాలను అభివృద్ధి చేయడం మరియు క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సవాళను పరిష్కరించడమే కాకుండా రసాయన పరిశోధనలో సుస్థిరమైన పద్ధతులను కూడా ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ కుటుంబం అయినా నా తండ్రి కించే మత్స్యరాజు, తల్లి కించే చిన్న తల్లి దంపతుల కుమార్తెగా తానెంతో గర్వపడుతున్నానని, ఈ పరిశోధనలో తనకు సహకరించిన ప్రొఫెసర్. సముద్రనిల్ పాల్, నా భర్త అద్దంకి సుధాకర్, సోదరి విజయభారతి- డాక్టర్.డాల్ పడాల్ మామయ్య, సోదరుడు కించే రవికుమార్ మరియు కుటుంబ సభ్యులందరికీ శకుంతల కృతజ్ఞతలు తెలిపారు.