
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 3:
చింతూరు పంచాయతీ పరిధిలోని మెడికల్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. కాలనీలో తాగునీటి కొరత, వీధి దీపాలు సరిగా పనిచేయకపోవడం వంటి అంశాలను స్థానిక ప్రజలు, జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు, మా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అని వాపోయారు. ప్రజలు తెలిపిన సమస్యలు క్లుప్తంగా విని ఈ సమస్యల పరిష్కార దిశగా సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి, వాళ్లతో మాట్లాడి సమస్యను పరిష్కార దిశగా, సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ఉపాధ్యక్షుడు తీగల రవి, ప్రధాన కార్యదర్శి బేడే సతీష్, సీనియర్ నాయకులు పయ్యాల నాగేశ్వరరావు, మల్లిపూడి సతీష్, బాబుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.