పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 20
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం లో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఎస్కె అహ్మద్అలి పేర్కొన్నారు, బుధవారం చింతూరులో రాజీవ్ గాంధీ 81వ జయంతి ఘనంగా నిర్వహించారు సెంటర్లోనే రాజీవ్ గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు, పిదప అహ్మద్ అలీ మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి రాజీవ్ గాంధీ పాడు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు సాంకేతిక రంగంలో కూడా మన దేశం రాజీవ్ గాంధీ హాయంలో నుంచే అభివృద్ధి చెందడం ప్రారంభం అయిందని అన్నారు రాజీవ్ గాంధీ పాలనలో దళిత గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు ఎస్.కె అక్బర్, నరేష్, బొక్కెల్లి ప్రసాద్, సోయం కన్నారావు, రవ్వ ప్రసాద్, ఎండి జవహర్, రవి ఎక్స్ ఎన్ పి టి సి, సోడి కృష్ణమూర్తి, మహిళా నాయకురాలు జానకి, లక్ష్మి, అశ్విని, అంజలి, తదితరులు పాల్గొన్నారు,