పయనించే సూర్యుడు న్యూస్ :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, గ్లింప్స్ , సాంగ్ కు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవలే రిలీజైన చికిరీ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. వందల మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్లిపోతోంది. ఇప్పటికే ఈ పాట అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల మార్క్ అందుకుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి చిన్న సర్ప్రైజ్ వచ్చింది. చికిరి సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.ఈ వీడియోలో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు తో సహా టీమ్ మొత్తం దాదాపు 45 నిమిషాల పాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి కొండపైన ఉన్న లొకేషన్‌కి చేరుకున్నారు. హీరో రామ్ చరణ్ కూడా కొండ ఎక్కుతూ అలసిపోయి ఆగుతూ ఎక్కడం ఇందులో మీరు చూడొచ్చు. చివరలో ‘చిరుత’ గురించి దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ మాట్లాడుకోవడం ఇందులో ఆసక్తికరంగా అనిపించింది. కాగా ‘చికిరి’ సాంగ్ ను మహారాష్ట్రలోని పుణెలో సవల్య ఘాట్ అనే ప్రాంతంలో చిత్రీ కరించారు. ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చదనంతో ఈ ఘాట్ కనువిందుగా ఉంటుంది. అక్కడే కొండపైన ‘చికిరి చికిరి’ పాట షూటింగ్ చేశారు. దీనిపైకి ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు. ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఈ క్రమంలోనే పెద్ది మూవీ టీమ్ కూడా అలానే వెళ్లింది. దాదాపు 45 నిమిషాల పాటు చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబుతోపాటు టీమ్ అంతా వెళ్లడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ మేకిండ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.