పయనించే సూర్యుడు అనంతపురం టౌన్ ప్రతినిధి నాగేంద్ర జనవరి 30
చిన్నారి ఆడుకునే సమయంలో వేడి నీళ్లు ఒంటి మీద పడి తీవ్ర గాయాలు పాలైన చిన్నారికి జామియా మసీదు ముతవల్లి కే.ఎం షఫీవుల్లా ఆర్థిక సాయం అందజేశారు. మూడు రోజుల క్రితం అనంతపురం పాతవురు రాణి నగర్ కు చెందిన ఎలక్ట్రిషన్ దాదా ఖలీందర్ , మొబీన దంపతుల కుమార్తె ఆఫీయా ఒంటి మీద వేడి నీళ్లు పడి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అనంతపురం నగరంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లగా వారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. మంచి వైద్యం చేయించాలంటే దాతలు సహాయ సహకారాలు అందించాలని కోరగా రాష్ట్ర ముతవల్లిల అధ్యక్షుడు కె.ఎం షకీల్ షఫీ సూచన మేరకు వారి తండ్రి అల్ హాజ్ షఫీవుల్లా గారు , సీనియర్ అడ్వకేట్ రెహమాన్ సాబ్ చేతుల మీదుగా గురువారం వారి కార్యాలయంలో చిన్నారి తల్లిదండ్రులకు 25,000 రూపాయల చెక్ రూపం లో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఏడాది వయసుగల పాపకు ఇలా జరగడం బాధాకర విషయం అని, త్వరగా కోలుకోవాలని ఆ అల్లాహ్ నుప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మైనార్టీ నేతలు మాట్లాడుతూ ఆఫియా తండ్రి దాదా ఖలీందర్ నిరుపేద కుటుంబానికి చెందినవాడని, ఎలక్ట్రిషన్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని, ఇలా జరగడం దురదృష్టంకారం, దాతలు ఎవరైనా సహాయ సహకారాలు అందించాలని, చిన్న పాప త్వరగా కోలుకోవాలని అల్లాహ్కు ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ అబ్బాస్,షౌకత్, జేమ్,బాషా,అంజు,జీలన్,షాబీర్,జాకిర్, బాబాజీ, నిజాం, షాకీర్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.