
పయనించే సూర్యుడు సెప్టెంబర్22: ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా సంకల్ప అభియాన్ 25 కోట్ల భారతీయ చిన్నారుల కలలు కార్యక్రమంలో భాగంగా కాట్రేనికోన వాణి ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన పోటీలు జరిగాయి.సేవా సంకల్ప అభియాన్ మండల సమన్వయకర్త పోలవరపు వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు.విద్యార్థులకు చదువు,క్రీడలు మెరుగు పరచడమే కాకుండా నూతన విద్యా విధానంతో మెరుగైన ఫలితాలు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.విద్యార్థులు తమ కలలను చిత్రాల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారని,వారి ఊహాశక్తి అభినందనీయమని కొనియాడారు.చదువుతో పాటు ఇలాంటి సృజనాత్మక పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ,కె వి ఎస్ ప్రసాద్, శిష్ట కృష్ణ , పెద్దింటి వ్యాసమూర్తి( తంబి) తదితరులు పాల్గొన్నారు.