కొత్తగూడెం .పయనించే సూర్యుడు.వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ను కలిసిన భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ ఈ నెల 12వ తేది నాడు పాల్వంచ పెద్దమ్మతల్లి గుడి నుండి కొత్తగూడెం విద్యానగర్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయం వరకు నిర్వహించనున్న విజయోత్సవ ర్యాలీకి రావాలని ఆహ్వానించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన కార్తీక్ ను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని జిల్లాలోని ప్రతి గడపగడపకు చేరే విధంగా ప్రచారం చేయాలనీ, రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విస్తృతంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏనుగుల అర్జున్ రావు, మతిన్, పాల సత్యనారాయణ రెడ్డి, కుంచెం వెంకటేష్, తాటి పవన్, శివ నాయక్, పల్లి ప్రణయ్, తదితరులు ఉన్నారు