
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి మీద దాడి చేయడం అంటే న్యాయవ్యవస్థ మీద రాజ్యాంగ స్ఫూర్తి మీద దాడి చేయడమే
ఒక దళితుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఉండడం ఓర్వలేని ఆధిపత్య శక్తులు చేస్తున్న దాడిగా భావిస్తున్నాం
దాడి ఘటనను సుమోటోగా తీసుకొని అడ్వకేట్ రాకేష్ కిషోర్ ను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి
రాజ్యాంగం పట్ల లోతైన అవగాహన సామాజిక న్యాయం పట్ల స్పష్టత కల్గిన ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు వెల్లడించి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుతున్న న్యాయ కోవిదుడు చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయి
ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ
( పయనించే సూర్యుడు అక్టోబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా దాడి చేయడం అంటే న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగ స్ఫూర్తి మీద ప్రజాస్వామ్య విలువల మీద దాడి చేయడమేనని, ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని అడ్వకేట్ రాకేష్ కిషోర్ ని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ డిమాండ్ చేశారు.షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్, ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి సుప్రీం ధర్మాసనంపై విధుల్లో ఉన్న చీఫ్ జస్టిస్ పై దాడి రాజ్యాంగ స్ఫూర్తిపై జరిగిన దాడిగా భావిస్తూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నాగ భూషణం మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పట్ల లోతైన అవగాహన, సామాజిక న్యాయం పట్ల స్పష్టత కల్గి ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు వెల్లడించి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుతున్న న్యాయ కోవిదుడిగా చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయి స్పూర్తిదాయకుడిగా నిలిచాడని అలాంటి వ్యక్తి మీద దాడికి దిగడం ఈ వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని మండిపడ్డారు. ఒక దళితుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఉండడం ఓర్వలేని ఆధిపత్య శక్తులు చేస్తున్న దాడిగా, అత్యున్నతమైన స్థానంలో కూర్చున్న కూడా మా ఆత్మగౌరవం మీద చేస్తున్న దాడిగా భావిస్తున్నామని అన్నారు.విధుల్లో ఉండగానే పేపర్ రోల్ విసిరే బూటుతో దాడి చేసే ప్రయత్నం చేసిన లాయర్ రాకేష్ కిషోర్ పై శాఖపరమైన తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండ అరెస్ట్ చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే తన బార్ కౌన్సిల్ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు పరచి తమ కుల, మత ఆధిపత్య ధోరణులు మారేలా మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు సనాతన ధర్మం పేరుతో మత ద్వేషాన్ని నింపుకొని వీధుల్లో ఉండగానే సుప్రీంలో దాడికి దిగడం హేయమైనదని అన్నారు. దాడి చేసిన మనోనిబ్బరాన్ని కోల్పోకుండా ఇలాంటి ఘటనలు నా దృష్టిని మళ్లించలేవు, నా పనితీరును ప్రభావితం చేయలేవని స్పష్టంగా ప్రకటించి తనపై కేసు పెట్టనని చెప్పి కోర్టులో వివిధ కేసులపై విచారణ కొనసాగించిన గొప్ప హృధారభావం ఉన్న వ్యక్తి జస్టిస్ గవాయి ను గుర్తుచేశారు .ప్రజలు న్యాయవ్యవస్థను నమ్మి, పాలనాపరమైన లోపాలను సవరించి ప్రజలకు న్యాయం చేసే సర్వోన్నతమైన శాసన వ్యవస్థగా 'న్యాయ స్థానాలను' కొలుస్తారని అలాంటి సుప్రీంకోర్టులో దాడి చేసి పశ్చాత్తాపమే లేకుండా ప్రవర్తించి లాయర్ రాకేష్ కిషోర్ ఈదేశ ప్రజల్ని గాయపరచాడని అన్నారు. స్వతంత్రమైన న్యాయవ్యవస్థలో ఇలాంటి ఘటనలు జరగకుండా కుల, మత, రాజకీయ ఇతరత్రా ఆధిపత్య ప్రభావాలు లేకుండా కాపాడాలని ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాగభూషణం మాదిగ ఎమ్మార్పీఎస్ ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు
చెనగళ్ల శ్రావణ్ కుమార్ మాదిగ , నందిగామ మండలం ఇంచార్జ్ ఎర్రోళ్ల సురేష్ మాదిగఎ ఎమ్ ఎస్ ఎఫ్ సీనియర్ నాయకులు, చెరుకు పల్లి శ్రీను మాదిగ ఎమ్మార్పీస్ నాయకులు,జంగారి రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నందిగామ గ్రామ అధ్యక్షుడు, విట్యాల యాదగిరి మాదిగ కిషన్ నగర్ మండల గ్రామ అధ్యక్షుడు, జోగు శ్రీశైలం మాదిగ, ఎల్లంపల్లి శీను మాదిగ, పామెన చింటూ మాదిగ, జోగు సిద్ధార్థ మాదిగ, పామెన లింగం మాదిగ, తదితరులు పాల్గొన్నారు